Sign in
Sign in
Sign in
Select Language
026

Ash-Shu'ara 26:94 فكبكبوا فيها هم والغاوون ٩٤

26:94
فَكُبۡكِبُواْ
فِيهَا
هُمۡ
وَٱلۡغَاوُۥنَ
٩٤
అప్పుడు వారు మరియు (వారిని) మార్గం తప్పించిన వారు, అందు (నరకం) లోకి విసిరివేయబడతారు.
Continue Reading

Read Tafsir

Ibn Kathir (Abridged)

Those Who have Taqwa and the Astray on the Day of Resurrection, and the Arguments and Sorrow of the Erring

وَأُزْلِفَتِ الْجَنَّةُ

(And Paradise will be brought near) means, it will be brought close to its people, adorned and decorated for them to behold it. Its people are the pious who preferred it t

…

Those Who have Taqwa and the Astray on the Day of Resurrection, and the Arguments and Sorrow of the Erring

وَأُزْلِفَتِ الْجَنَّةُ

(And Paradise will be

…
More Tafsirs

Read in Context

Chapter 26, Page 371, Juz 19

69. ఇక వారికి ఇబ్రాహీమ్ గాథను వినిపించు. 70. అతను తన తండ్రితో మరియు తన జాతి వారితో: "మీరెవరిని ఆరాధిస్తున్నారు?" అని అడిగినపుడు; 71. వారన్నారు: "మేము విగ్రహాలను ఆరాధిస్తున్నాము మరియు మేము వాటికే ఎల్లప్పుడు భక్తులమై ఉంటాము." 72. (ఇబ్రాహీమ్) అన్నాడు: "మీరు వీటిని పిలిచినప్పుడు ఇవి మీ మొర ఆలకిస్తాయా? 73. లేదా, మీకేమైనా మేలు చేయగలవా? లేదా హాని చేయగలవా?" 74. వారన్నారు: "అలా కాదు! మేము మా తండ్రితాతలను ఇలా చేస్తూ ఉండగా చూశాము." 75. అతను అన్నాడు: "ఏమీ? మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మీరెవరిని ఆరాధిస్తున్నారో? 76. మీరు గానీ మరియు మీ పూర్వీకులైన మీ తాతముత్తాతలు గానీ (ఆలోచించారా)? 77. ఎందుకంటే! నిశ్చయంగా, ఇవన్నీ నా శత్రువులే! కేవలం ఆ సర్వలోకాల ప్రభువు తప్ప! 78. ఆయనే నన్ను సృష్టించాడు. కాబట్టి ఆయనే నాకు మార్గదర్శకత్వం చేస్తాడు. 79. ఆయనే నాకు తినిపించేవాడు మరియు త్రాగించేవాడు. 80. మరియు నేను వ్యాధిగ్రస్తుడనైతే, ఆయనే నాకు స్వస్థత నిచ్చేవాడు. 81. మరియు ఆయనే నన్ను మరణింపజేసేవాడు, తరువాత మళ్ళీ బ్రతికింపజేసేవాడు. 82. మరియు ఆయనే తీర్పుదినమున నా తప్పులను క్షమిస్తాడని మేము ఆశిస్తున్నాను. 83. మరియు ఓ నా ఫ్రభూ! నాకు వివేకాన్ని ప్రసాదించు మరియు నన్ను సద్వర్తనులలో కలుపు. 84. మరియు తరువాత వచ్చే తరాల వారిలో నాకు మంచి పేరును ప్రసాదించు. 85. మరియు సర్వసుఖాల స్వర్గానికి వారసులయ్యేవారిలో నన్ను చేర్చు. 86. మరియు నా తండ్రిని క్షమించు. నిశ్చయంగా, అతడు మార్గభ్రష్టులలోని వాడే! 87. మరియు అందరూ తిరిగి బ్రతికింపబడే రోజు నన్ను అవమానం పాల చేయకు. 88. ఏ రోజునైతే ధనసంపత్తులు గానీ, సంతానం గానీ పనికిరావో! 89. కేవలం నిర్మలమైన హృదయంతో అల్లాహ్ సన్నిధిలో హాజరయ్యేవాడు తప్ప!" 90. మరియు (ఆ రోజు) స్వర్గం దైవభీతి గలవారి దగ్గరకు తీసుకు రాబడుతుంది. 91. మరియు నరకం మార్గం తప్పిన వారి ముందు పెట్టబడుతుంది. 92. మరియు వారితో అనబడుతుంది: "మీరు ఆరాధించేవారు (ఆ దైవాలు) ఇప్పుడు ఎక్కడున్నారు? 93. అల్లాహ్ ను వదలి (మీరు వాటిని ఆరాధించారు కదా!) ఏమీ? వారు మీకు సహాయం చేయగలరా? లేదా తమకు తామైనా సహాయం చేసుకోగలరా?" 94. అప్పుడు వారు మరియు (వారిని) మార్గం తప్పించిన వారు, అందు (నరకం) లోకి విసిరివేయబడతారు. 95. మరియు వారితో బాటు ఇబ్లీస్ సైనికులందరూ. 96. వారు పరస్పరం వాదించుకుంటూ ఇలా అంటారు: 97. "అల్లాహ్ సాక్షిగా! మేము స్పష్టమైన మార్గభ్రష్టత్వంలో పడి ఉన్నాము. 98. ఎప్పుడైతే మేము మిమ్మల్ని సర్వలోకాల ప్రభువుతో సమానులుగా చేశామో! 99. మరియు మమ్మల్ని మార్గభ్రష్టులుగా చేసింది కేవలం ఈ అపరాధులే. 100. మాకిప్పుడు సిఫారసు చేసేవారు ఎవ్వరూ లేరు. 101. మరియు ఏ ప్రాణ స్నేహితుడు కూడా లేడు. 102. ఒకవేళ మళ్ళీ మరలిపోయే అవకాశం మాకు దొరికి ఉంటే, మేము తప్పకుండా విశ్వసించిన వారిలో చేరిపోతాము!" 103. నిశ్చయంగా, ఇందులో ఒక సూచన ఉంది. అయినా వారిలో చాలా మంది విశ్వసించటం లేదు. 104. మరియు నిశ్చయంగా, నీ ప్రభువు కేవలం ఆయనే, సర్వశక్తిమంతుడు, అపార కరుణా ప్రదాత.

- Maulana Abder-Rahim ibn Muhammad

Notes and Reflections

You do not have any notes or reflections on this verse.

Notes placeholders

Stay Connected to the Quran ❤️

Short meaningful reminders to reset, reflect and stay connected to the Quran.

Read, Listen, Search, and Reflect on the Quran

Quran.com is a trusted platform used by millions worldwide to read, search, listen to, and reflect on the Quran in multiple languages. It provides translations, tafsir, recitations, word-by-word translation, and tools for deeper study, making the Quran accessible to everyone.

As a Sadaqah Jariyah, Quran.com is dedicated to helping people connect deeply with the Quran. Supported by Quran.Foundation, a 501(c)(3) non-profit organization, Quran.com continues to grow as a free and valuable resource for all, Alhamdulillah.

Navigate
Home
Quran Radio
Reciters
About Us
Developers
Product Updates
Feedback
Help
Donate
Our Projects
Quran.com
Quran For Android
Quran iOS
QuranReflect.com
Quran.AI
Sunnah.com
Nuqayah.com
Legacy.Quran.com
Corpus.Quran.com
Non-profit projects owned, managed, or sponsored by Quran.Foundation
Popular Links
Duas from the Quran
Quran Verse of the Day
Ayatul Kursi
Yaseen
Al Mulk
Ar-Rahman
Al Waqi'ah
Al Kahf
Al Muzzammil
SitemapPrivacyTerms and Conditions
© 2026 Quran.com. All Rights Reserved
Contribute