Sign in
Sign in
Sign in
Select Language
009

At-Tawbah 9:106 واخرون مرجون لامر الله اما يعذبهم واما يتوب عليهم والله عليم حكيم ١٠٦

9:106
وَءَاخَرُونَ
مُرۡجَوۡنَ
لِأَمۡرِ
ٱللَّهِ
إِمَّا
يُعَذِّبُهُمۡ
وَإِمَّا
يَتُوبُ
عَلَيۡهِمۡۗ
وَٱللَّهُ
عَلِيمٌ
حَكِيمٞ
١٠٦
మరికొందరు అల్లాహ్ ఆజ్ఞ (తీర్పు) కొరకు వేచి ఉన్నారు. ఆయన వారిని శిక్షించనూ వచ్చు, లేదా క్షమించనూ వచ్చు! మరియు అల్లాహ్ సర్వజ్ఞుడు, మహా వివేకవంతుడు.
Continue Reading

Read Tafsir

Ibn Kathir (Abridged)

Delaying the Decision about the Three Companions Who stayed away from the Battle of Tabuk

Ibn `Abbas, Mujahid, `Ikrimah, Ad-Dahhak and several others said that those mentioned in the Ayah are the three who were made to wait to know if their repentance was accepted; Mararah bin Ar-Rabi`, Ka`b bin Mali

…

Delaying the Decision about the Three Companions Who stayed away from the Battle of Tabuk

Ibn `Abbas, Mujahid, `Ikrimah, Ad-Dahhak and several others s

…
More Tafsirs

Read in Context

Chapter 9, Page 203, Juz 11

100. మరియు వలస వచ్చిన ముహాజిర్ లలో నుండి మరియు అన్సారులలో (మదీనావాసులలో) నుండి, ప్రప్రథమంగా ముందంజ వేసిన (ఇస్లాం ను స్వీకరించిన) వారితోనూ మరియు సహృదయంతో వారిని అనుసరించిన వారితోనూ, అల్లాహ్ సంతోషపడ్డాడు. మరియు వారు కూడా ఆయనతో సంతోషపడ్డారు. మరియు వారి కొరకు క్రింద సెలయేళ్ళు ప్రవహించే స్వర్గవనాలను సిద్ధ పరిచి ఉంచాడు. వారు వాటిలో శాశ్వతంగా కలకాలముంటారు. అదే గొప్ప సాఫల్యం (విజయం). 101. మరియు మీ చుట్టుప్రక్కల ఉండే ఎడారివాసులలో (బద్దూలలో) కొందరు కపట విశ్వాసులున్నారు. మరియు (ప్రవక్త) నగరం (మదీనా మునవ్వరా)లో కూడా (కపటవిశ్వాసులు) ఉన్నారు. వారు తమ కాపట్యంలో నాటుకొని ఉన్నారు. కాని (ఓ ప్రవక్తా!) నీవు వారిని ఎరుగవు. మేము వారిని ఎరుగుతాము. మేము వారికి రెట్టింపు శిక్షను విధించగలము. తరువాత వారు ఘోరశిక్ష వైపుకు మరలింపబడతారు. 102. మరియు ఇతరులు, తమ పాపాలను ఒప్పుకున్న వారున్నారు. వారు తమ సత్కార్యాన్ని ఇతర పాపకార్యంతో కలిపారు. అల్లాహ్ వారిని తప్పక క్షమిస్తాడు! నిశ్చయంగా, అల్లాహ్ క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత. 103. (కావున ఓ ప్రవక్తా!) నీవు వారి సంపదల నుండి దానం (సదఖహ్) తీసుకొని, దానితో వారి పాపవిమోచనం చెయ్యి మరియు వారిని సంస్కరించు. మరియు వారి కొరకు (అల్లాహ్ ను) ప్రార్థించు. మరియు నిశ్చయంగా, నీ ప్రార్థనలు వారికి మనశ్శాంతిని కలిగిస్తాయి. అల్లాహ్ సర్వం వినేవాడు, సర్వజ్ఞుడు. 104. ఏమీ? వాస్తవానికి అల్లాహ్ తన దాసుల పశ్చాత్తాపాన్ని (తౌబహ్ ను) అంగీకరిస్తాడని మరియు వారి దానాలను (సదఖాత్ లను) స్వీకరిస్తాడని వారికి తెలియదా? నిశ్చయంగా, అల్లాహ్! ఆయన మాత్రమే, పశ్చాత్తాపాన్ని అంగీకరించేవాడు, అపార కరుణా ప్రదాత. 105. మరియు (ఓ ప్రవక్తా!) వారితో అను: "మీరు (మీ పని) చేస్తూ ఉండండి, అల్లాహ్ ఆయన ప్రవక్త మరియు విశ్వాసులు మీరు చేస్తున్న పనులు చూస్తున్నారు. తరువాత మీరు తప్పక అగోచర మరియు గోచర విషయాలను ఎరుగు ఆయన (అల్లాహ్) వద్దకు తిరిగి పంపబడగలరు. అప్పుడాయన మీరు చేస్తూ వున్న కర్మలను గురించి మీకు తెలియజేస్తాడు." 106. మరికొందరు అల్లాహ్ ఆజ్ఞ (తీర్పు) కొరకు వేచి ఉన్నారు. ఆయన వారిని శిక్షించనూ వచ్చు, లేదా క్షమించనూ వచ్చు! మరియు అల్లాహ్ సర్వజ్ఞుడు, మహా వివేకవంతుడు. 107. మరియు (కపట విశ్వాసులలో) కొందరు (విశ్వాసులకు) హాని కలిగించటానికి, సత్యతిరస్కార వైఖరిని (బలపరచటానికి) మరియు విశ్వాసులను విడదీయటానికి, అల్లాహ్ మరియు ఆయన సందేశహరునితో ఇంతకు ముందు పోరాడిన వారు పొంచి ఉండటానికి, ఒక మస్జిద్ నిర్మించారు. మరియు వారు: "మా ఉద్దేశం మేలు చేయటం తప్ప మరేమీ కాదు!" అని గట్టి ప్రమాణాలు కూడా చేస్తున్నారు. కాని వారు వాస్తవంగా అసత్యవాదులని అల్లాహ్ సాక్ష్యమిస్తున్నాడు. 108. నీవెన్నడూ దానిలో (నమాజ్ కు) నిలబడకు. మొదటి రోజు నుండియే దైవభీతి ఆధారంగా స్థాపించబడిన మస్జిదే నీకు (నమాజ్ కు) నిలబడటానికి తగినది. అందులో పరిశుద్ధులు కాగోరేవారున్నారు. మరియు అల్లాహ్ పరిశుద్ధులు కాగోరేవారిని ప్రేమిస్తాడు. 109. ఏమీ? ఎవడైతే అల్లాహ్ యందు గల భయభక్తులు మరియు ఆయన ప్రీతి, పునాదుల మీద తన (మస్జిద్) కట్టడాన్ని కట్టాడో, అతడు శ్రేష్ఠుడా? లేక, తన కట్టడపు పునాదులను, వరదలకు కూలిపోయి దాని క్రింది భాగం ఖాళీగా ఉన్న నది ఒడ్డున కట్టేవాడా? అది వానితో సహా నరకాగ్నిలోకి కొట్టుకొని పోతుంది. మరియు అల్లాహ్ దుర్మార్గులకు సన్మార్గం చూపడు. 110. వారి హృదయాలు ముక్కలైపోయి (వారు చనిపోయి) నంత వరకు, వారు కట్టిన కట్టడం వారి హృదయాలలో కలతలు పుట్టిస్తూ ఉంటుంది. మరియు అల్లాహ్ సర్వజ్ఞుడు, మహా వివేచనాపరుడు.

- Maulana Abder-Rahim ibn Muhammad

Notes and Reflections

You do not have any notes or reflections on this verse.

Notes placeholders

Stay Connected to the Quran ❤️

Short meaningful reminders to reset, reflect and stay connected to the Quran.

Read, Listen, Search, and Reflect on the Quran

Quran.com is a trusted platform used by millions worldwide to read, search, listen to, and reflect on the Quran in multiple languages. It provides translations, tafsir, recitations, word-by-word translation, and tools for deeper study, making the Quran accessible to everyone.

As a Sadaqah Jariyah, Quran.com is dedicated to helping people connect deeply with the Quran. Supported by Quran.Foundation, a 501(c)(3) non-profit organization, Quran.com continues to grow as a free and valuable resource for all, Alhamdulillah.

Navigate
Home
Quran Radio
Reciters
About Us
Developers
Product Updates
Feedback
Help
Donate
Our Projects
Quran.com
Quran For Android
Quran iOS
QuranReflect.com
Quran.AI
Sunnah.com
Nuqayah.com
Legacy.Quran.com
Corpus.Quran.com
Non-profit projects owned, managed, or sponsored by Quran.Foundation
Popular Links
Duas from the Quran
Quran Verse of the Day
Ayatul Kursi
Yaseen
Al Mulk
Ar-Rahman
Al Waqi'ah
Al Kahf
Al Muzzammil
SitemapPrivacyTerms and Conditions
© 2026 Quran.com. All Rights Reserved
Contribute